Mamata Benarjee Says AP Cm Chandra Babu Also In Race For PM | Oneindia Telugu

2019-02-15 1

West Bengal CM Mamata Benarjee key commetns on Aspirants of PM in up coming elections. She mentioned four names including AP Cm Chandra babu also in race for PM. No these comments creating political heat in AP.
#MamataBenarjee
#Chandrababu
#kcr
#politiciansinPMrace
#rahulgandhi
#saradpawar
#farooqabdullah
#delhi


సార్వత్రిక ఎన్నికలకు ముందే పొత్తులపై అవగాహన ఉంటుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి పొత్తులు ఆధారపడి ఉంటాయని తెలిపారు. రాష్ట్రాల్లో ఎవరి ఇష్ట ప్రకారం వారు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో వ్యతిరేకించుకున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తామన్నారు. జాతీయ రాజ‌కీయాల్లో తొలుత చంద్ర‌బాబు ప్ర‌యత్నాలుకు మ‌మ‌తా అంత‌గా స‌హ‌క‌రించ‌లేదు. ఆ త‌రువాత కేసీఆర్ కోల్‌క‌త్తా వెళ్లి మ‌మ‌తా తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించారు.
ఆ స‌మ‌యం లోనూ త‌న అభిప్రాయం ఏంటో మ‌మ‌త స్ప‌ష్టం చేయ‌లేదు. ఇక‌, కొద్ది రోజులుగా కేంద్రం తో ఢీ అంటే ఢీ అంటున్న మ‌మ‌తా బెనర్జీ ప్ర‌ధాని రేసులో ముందున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ ను ప్ర‌ధానిగా అంగీక‌రించ‌టం లేద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని పోటీలో బాబు ఉన్నార‌ని చెప్ప‌టం తాజాగా ఏపి రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.
ఇక‌, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ - బిజెపి ఇత‌ర పార్టీల‌తో కేసీఆర్ చేసిన మంత‌నాలు కొద్ది రోజులుగా నిలిచిపోయా యి. అయితే, తాజాగా కేసీఆర్ తోనూ తాను మాట్లాడాన‌ని చెప్ప‌టం ద్వారా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌నుల విర మించుకున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడానని చెప్పారు. 'అందరూ వస్తారు... వేచి చూడండి' అని మ‌మ‌తా విశ్వాసం వ్యక్తం చేశారు.